విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:16 PM
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుం దని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని కేజీబీవీ పాఠశాలను సంద ర్శించారు. విద్యార్ధినీలతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు.

- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుం దని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని కేజీబీవీ పాఠశాలను సంద ర్శించారు. విద్యార్ధినీలతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం భోజనశాలను పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సంబంధిత అధికారులు నిర్మాణాలను పరిశీలించాల న్నారు. అనంతరం పోతనపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నాణ్యమైన భోజనం అందిం చాలని సూచించారు. అనంతరం నర్సింగాపూ ర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సం దర్శించారు. తాగునీరు, విద్యుత్, మూత్రశాల ను, తరగతి గదులను ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫసీర్ కనకలక్ష్మీ, మహేష్, ఆర్‌ఐ స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.