Share News

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:28 PM

రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ హెచ్చరించారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

- అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యో తి): రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారు లతో కలిసి పౌర సరఫరాల ఉప తహసీ ల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రేషన్‌ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పీడీఎస్‌ బియ్యం అక్రమంగా కొనడం, అమ్మడం చేసిన వారిపై పీడీఎస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ 2016 ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యాన్ని అవసరాల కోసం వినియోగించాలని విక్రయించకూడ దని తెలిపారు. ఎవరైనా పీడీఎస్‌ బియ్యం అక్రమంగా కొనుగోలు, విక్రయిచినట్లు గుర్తిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వారి రేషన్‌ కార్డు తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:28 PM