Share News

యువతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:43 PM

: క్రీడలు యువతకు ఎంతో దోహదపడుతాయని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు.

యువతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి
క్రికెట్‌ ఆడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు

- సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు

- పాల్వాయి పురుషోత్తంరావు మెమోరియల్‌ టోర్నీ ప్రారంభం

సిర్పూరు(టి), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలు యువతకు ఎంతో దోహదపడుతాయని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. సోమవారం సిర్పూరు(టి) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పాల్వా యి పురుషోత్తంరావు మెమోరియల్‌ టోర్నీని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమలు సహజమన్నారు. గ్రామీణ ప్రాంతాల యువకులు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్‌ ఆడారు. కార్యక్రమంలో సిర్పూరు బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు లావణ్య, నాయకులు పైడి విలాస్‌, నానాయ్య, ఆశోక్‌, శ్యాంరావు, పైడి వేణుగోపాల్‌ గుప్తా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 11:43 PM