Share News

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:05 PM

ప్రభు త్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుం టుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి జిల్లాలోని మంచిర్యాల పట్టణం సాయికుంట ప్రాంతంలో గల వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి వంటశాల, భోజనం తయారీ విధానం, గదులు విద్యా ర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్ధులతో కలిసి బస చేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుం టుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి జిల్లాలోని మంచిర్యాల పట్టణం సాయికుంట ప్రాంతంలో గల వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి వంటశాల, భోజనం తయారీ విధానం, గదులు విద్యా ర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంత రం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. శారీరక కార్యకలా పాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యా ర్థుల సంక్షేమంపై నెలవారీ పేరెంట్స్‌ కమిటీ సమా వేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్న త లక్ష్యాల సాధన దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధి కారి శ్రీహరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:05 PM