Share News

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:50 PM

ఇంటర్‌ ఐపీఈ థియరీ ఎగ్జామ్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జనరల్‌ విద్యార్థులు 6,597 విద్యార్థులు కాగా 6,372 మంది హాజరుకాగా 225 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

 ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలలో పరీక్ష హాల్‌లోకి క్యూలో వెళ్తున్న విద్యార్థులు

- జనరల్‌ విద్యార్థుల్లో 6,597గానూ 6,372 మంది హాజరు

మంచిర్యాల క్రైం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఐపీఈ థియరీ ఎగ్జామ్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జనరల్‌ విద్యార్థులు 6,597 విద్యార్థులు కాగా 6,372 మంది హాజరుకాగా 225 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్‌ విద్యార్థులు 668 మంది విద్యార్థులు కాగా 600 మంది హాజరుకాగా 68 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌ విద్యాధికారి అంజయ్య తెలిపారు. అన్ని సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు. కొందరు సమయానికి రావడంతో పరుగులు తీశారు. పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

దండేపల్లి: మండలంలో 141 మంది విద్యార్థులకు గాను 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నలుగురు గెర్హాజరైనట్లు పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ బి శోభ, డిపార్ట్‌మెంటల్‌ అధికారి సాయికుమార్‌ వెల్లడించారు. పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్‌ సంధ్యరాణి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సందర్శించారు. ఎస్‌ఐ తైసినోద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

లక్షెట్టిపేట: లక్షెట్టిపేట పట్టణంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్ష బుధవారం మొదటి రోజు ప్రశాంతంగా సాగింది. మండల కేంద్రంలో మొత్తం రెండు సెంటర్లను ప్రభుత్వం విధ్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది. రెండు సెంటర్లలో కలిసి 520విధ్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 26మంది పరీక్షకు గైరాజరు కావడంతో 494మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విధ్యార్థులకు మంచినీటితో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాలను పట్టణ సీఐ నరేందర్‌తో పాటు తహాసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌ పరిశీలించారు.

మందమర్రిరూరల్‌ : మండలంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదర్శ పాఠశాలలోని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 311 మంది విద్యార్థులకు గాను 303 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెం డెంట్‌ అమీరున్నీసా తెలిపారు. డీవో అనిత పరీక్షను పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

జన్నారం : మండలంలో మొదటి రోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రశాం తంగా జరిగింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో 145 మందికి గాను 134 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్‌ శ్రీని వాస్‌ తెలిపారు. కరిమల జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో 129 మంది విద్యార్థులకు 121 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను తహసీల్దార్‌ రాజమనోహర్‌ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు తగిన మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌ : పరీక్షలు జరిగే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని డిపార్టుమెంటల్‌ అధికారి బాలాజీని అడిగి తెలుసుకున్నారు. మొదటిరోజు 247 మంది విద్యార్థులకు 239 మంది విద్యార్థులు హాజరయ్యారని కలెక్టర్‌కు తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు తాగునీరు తదితర సౌక ర్యాలను కల్పించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తెచ్చేటప్పుడు, పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలను తీసుకుని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్టు ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, తహసీల్దార్‌ వనజారెడ్డి, సిట్టింగ్‌ స్క్వాడ్‌ శ్రీనివాస్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ బండి ప్రసాద్‌, జిల్లా ఎగ్జామినేషన్‌ కమిటీ మెంబర్‌ శంకర్‌ ఉన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:50 PM