‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:28 PM
రాబోయే పదోతరగతి పరీక్షలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త వరంగల్ సంచాలకులు సత్యనారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలోని మండల విధ్యాధి కారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపా ధ్యాయులతో నస్పూర్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త వరంగల్ సంచాలకులు సత్యనారాయణరెడ్డి
నస్పూర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : రాబోయే పదోతరగతి పరీక్షలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త వరంగల్ సంచాలకులు సత్యనారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలోని మండల విధ్యాధి కారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపా ధ్యాయులతో నస్పూర్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడు తూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిం చడానికి అమలు చేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమాల అమ లుకు అందిస్తున్న నిధులు నిబంధనల ప్రకా రం ఖర్చు చేయాలని సూచించారు. టుడైస్ ఫ్లేస్‌లో పాఠశాలలో వసతుల వివరాలను నమోదు చేయాలని, పీజీఐలో జిల్లా, రాష్ట్ర ర్యాంక్‌లను మెరుగుపర్చడం కోసం చొరవ చూపాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఆర్‌జేడీ సూచించారు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకుని వందశాతం ఫలితాలు సాధించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. సమా వేశంలో ఇన్‌చార్జి జిల్లా విధ్యాధికారి లలిత, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామో దర్‌రావు, జిల్లా సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు చౌదరి యశోద, శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, ఏఎస్‌సీ రాజ్‌కుమార్, ఎంఈవోలు, ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.
- విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు..
పదోతరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దని, శ్రద్ధతో చదివి పరీక్షలు రాసి మంచిఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారానా సూచించారు. విదార్థులకు ప్రేరణ కల్పించడానికి నస్పూర్ పట్టణం తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ పాఠ శాల మంగళవారం టీసాట్ చానల్ ద్వారా సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో ముం దుకు వెళ్ళాలని సూచించారు. అంతకు ముందు పాఠశాల ను విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సం యుక్తసంచాలకులు సత్యనారాయణరెడ్డి సందర్శించారు. విద్యార్థులతో మాట్లా డారు. మంచిగా చదివితే బంగారుభవిష్యత్ ఉంటుందని, ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఏర్పడుతుందని సత్యనారాయణ రెడ్డి సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడు రామన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.