ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:26 PM
మెదక్, నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్‌ను పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ అధికారు లను ఆదేశించారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మెదక్, నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్‌ను పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ అధికారు లను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఉపాధ్యాయ, పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొరకు నియమింబడిన ప్రిసైడింగ్, సహయ ప్రిసైడిం గ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిం చిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 27న జరిగే పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తం గా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వ హించాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావు గా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు డైరీపై పూర్తి అవగాహ న కలిగి ఉండాలన్నారు. ఈ నెల 26న ఉద యం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరు కోవాలని, సకాలంలో రిపోర్టు చేసి పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పరిశీలించి కేటా యించిన ప్రకారం ఉన్నవాటి వివరాలు సరి చూసుకుని తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులకు సీలు వేయాలని, సిబ్బంది కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ ఉంటుందని, విధుల్లో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని, పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపట్లు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులో సీలుపై సిబ్బందికి శిక్షణ అందించా రు. అనంతరం కలెక్టరేట్ పోలింగ్ విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అఽధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలి
ప్రతిఒక్కరూ ఆర్థిక కార్యకలాపాలపై అవగహన కలిగి ఉండాలని కలెక్టర్ వేంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మహిళ ఉద్యోగులకు నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా 2016 నుంచి ప్రతి గ్రామం, పట్టణంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈనెల 24వ తేది నుంచి 28వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత ఉత్సవాల్లో భాగంగా అవగా హన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంద న్నారు. మహిళలు, గృహ బడ్జెట్, సూక్ష్మ పొదుపు, శ్రామిక మహిళలు నెలవారీ పొదుపు వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు, అనంతరం ఆర్థిక అక్షరాస్యత ఉత్సవాలకు సం బంధించిన గోడప్రతులన అవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనెజర్ రాజేశ్వర్ జోషి, డీఆర్‌డీవో దత్తారాం తదితరులు పాల్గొన్నారు.