ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:41 PM
శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిం చాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కుమరం భీం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిం చాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కాంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు వివరాలు నమోదు, పేపర్లు వరుస సంఖ్యలో ఉండేలా చుడాలన్నారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ సిబ్బంది ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారంలోగా మరోసారి శిక్షణ ఇస్తామని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, తహసీల్దా ర్లు, ప్రిసైడిండ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన..
ఆసిఫాబాద్‌రూరల్ (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీ గా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నం దున జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనం తరం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అంది స్తున్న బోధన తీరుపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు హజరయ్యేలా ఉపాధ్యాయులు సమన్వయం తో కృషి చేయలన్నారు. పరీక్షలకు 40 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ప్రణాళికకు అనుగుణంగా విద్యా ర్థులను పరీక్షలకు సిద్దం చేయాలన్నారు. తహసీల్దార్ రోహత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.