Share News

Kumaram Bheem Asifabad: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:17 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు.

Kumaram Bheem Asifabad:  అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల సంక్షేమానికి కృషి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ గ్రామంలో రైతువేదిక వద్ద గల అంగన్‌వాడీకేంద్రాన్ని జిల్లా సంక్షేమాధికారి ఆడెపు భాస్కర్‌తో కలిసి సందర్శించారు. కేంద్రంలో సదుపా యాలు, పరిసరాలు, ఆహారసామాగ్రి నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీకేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, ఇతరమౌళిక సదుపా యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. శారీ రక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిసంక్షేమంపై ప్రత్యే కదృష్టి సారించాలన్నారు. గర్భిణులు తమ వివరాలను సమీప ప్రాథమికఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుప త్రుల్లో నమోదు చేసుకుని సమయానుసారంగా వైద్యపరీక్షలు నిర్వహించుకునే విధంగా చూడాల న్నారు. వారు సమయానికి మందులు, పౌషికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాల న్నారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఈ ప్రభాకర్‌, మున్సి పల్‌ కమిషనర్‌ భుజంగరావు, సీడీపీఎ సదియ, ఏపీవో చంద్రశేఖర్‌, తదితరులు ఉన్నారు.

‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి..

కాగజ్‌నగర్‌: రానున్న పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాఽధించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలను ఆయన, సబ్‌కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పదోతరగతి పరీక్షల్లో విద్యా ర్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలకు విద్యార్థులంతా సన్నద్థం కావాలన్నారు. సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు ప్రిపేర్‌ కావాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనం తదిత రాలను పరిశీలించారు.

Updated Date - Jan 04 , 2025 | 11:17 PM