Kumaram Bheem Asifabad: క్రీడల్లో గెలుపు ఓటములు సహజం: ఎస్పీ
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:06 PM
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): క్రీడాపోటీల్లో గెలుపు ఓటములు సహజమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.

ఆసిఫాబాద్ రూరల్, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): క్రీడాపోటీల్లో గెలుపు ఓటములు సహజమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ క్రీడామైదానంలో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య ఫ్రెండ్లీక్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్‌టీం 8ఓవర్లలో 58 పరుగులు చేయగా పోలీసుజట్టు 5ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటమిచెందిన క్రీడాజట్టు నిరు త్సాహ పడకుండా భవిష్యత్‌లో గెలుపు నకు ప్రయత్నించాలన్నారు. అనంతరం విన్నర్, రన్నర్‌లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్‌ఐ పెద్దయ్య, అంజన్న, సీఐలు రాణాప్రతాప్, రవీందర్, శ్రీనివాస్. సత్య నారాయణ, ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.