Kumaram Bheem Asifabad: ‘వేల గొంతుకలు.. లక్ష డప్పులు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:11 PM
తిర్యాణి, జనవరి 17(ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్‌లో ఫిబ్ర వరి 7న నిర్వహించే ‘వేల గొంతుకలు.. లక్ష డప్పులు’ కార్యక్రమాన్ని మండలంలోని మాదిగలందరూ హాజరై విజయ వంతం చేయాలని ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్, జిల్లాఅధ్యక్షుడు కేశవ రావు పిలుపునిచ్చారు.

తిర్యాణి, జనవరి 17(ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్‌లో ఫిబ్ర వరి 7న నిర్వహించే ‘వేల గొంతుకలు.. లక్ష డప్పులు’ కార్యక్రమాన్ని మండలంలోని మాదిగలందరూ హాజరై విజయ వంతం చేయాలని ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్, జిల్లాఅధ్యక్షుడు కేశవ రావు పిలుపునిచ్చారు. శుక్ర వారం మండలం కేంద్రంలో డప్పులతో భారీర్యాలీ నిర్వహిం చారు. అనంతరం కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్ర మంలో పెద్దసంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, ఎల్లయ్య, వెంకటేశం, రాయలింగు, బాబు, లింగేష్, అంజయ్య,ఆశాలు,తదితరులు పాల్గొన్నారు.