Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:07 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహిం చారు.

Kumaram Bheem Asifabad:   ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీజిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీని వాస్‌, విజయ్‌, మల్లికార్జున్‌ యాదవ్‌, అరుణ్‌ లోయ, విజయ్‌, నరేష్‌, మణిక్‌రావు, సురేష్‌, జయరాజ్‌, శంభు తదితరులు పాల్గొన్నారు.

- జిల్లాకేంద్రంలోని వివేకానందచౌక్‌లో వాసవిక్లబ్‌ ఆధ్వర్యంలో స్వామివివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం దివ్యాంగులకు బియ్యం, దుప్పట్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్‌ సభ్యులు శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, శంకర్‌, శ్రీనివాస్‌, వెంకన్న పాల్గొన్నారు.

- స్వామి వివేకానందను యువతస్ఫూర్తిగా తీసుకోవాలని డీవైఎస్‌వో రమాదేవి అన్నారు. ఆదివారం గిరిజన ఆదర్శ బాలికల క్రీడాపాఠశాలలో జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, హెచ్‌ఎం జంగు, కోచ్‌లు అరవింద్‌, రాకేష్‌, ఏఎన్‌ఎం కృష్ణవేణి పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: స్వామివివేకానంద ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీజిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి ఆశయాల కొనసాగించేందుకు యువత ముందుండాలన్నారు.

దహెగాం: మండలకేంద్రంలోని అంగడిబజార్‌లో ఆదివారం స్వామివివేకానంద జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ ధనుంజయ్‌, నాయకులు సంతోష్‌గౌడ్‌, పరమేశ్వర్‌, గంగాధర్‌, సంజీవ్‌, మల్లేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:07 PM