Kumaram Bheem Asifabad: ప్రభుత్వ పథకాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:26 PM
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నా రు.

ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నా రు. గురువారం మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో చేపడుతున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతుభరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలు నమోదు చేయకూడదన్నారు. వివిధ పథకాలపై ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ కింద తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడ దన్నారు. రాళ్లు, గుట్టలు గల భూములను పరిశీలించాలని సూచిం చారు. రేషన్‌కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రోహత్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సిబ్బంది ఉన్నారు.