Share News

Kumaram Bheem Asifabad: ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ABN , Publish Date - Jan 05 , 2025 | 10:49 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికతను అలవ ర్చుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.

 Kumaram Bheem Asifabad:  ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికతను అలవ ర్చుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అనంత శ్రీవిభుషిత రామా నందచార్య పాదుక దర్శన కార్యక్రమం కరపత్రాలను ఆదివారం తన నివాసంలో నిర్వాహకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రేమలాగార్డెన్‌ సమీపంలో ఈనెల 17న పాదుక దర్శన కార్యక్రమం నిర్వహిస్తామని పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్వహకులు దిలీప్‌ గైక్వాడ్‌, బాలాజీ, పండరి, నిరక్షక్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవుగూడను సందర్శించిన ఎమ్మెల్యే..

జైనూర్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం మండలంలోని దేవుగూడ గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల జైనూరు ఘటనలో హత్యాచారయత్నానికి గురైన మేస్రాం నీలబాయితో మాట్లాడారు. ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శిం చేందుకు నేడు సోమవారం తెలంగాణ జనజాగృతి అధ్యక్షు రాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారని నాయ కులు, గ్రామస్థులకు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత బాధితు రాలు నీల బాయిని పరామర్శించి తక్షణ సహాయం కింద 2లక్షల రుపాయల ఆర్థికసాయం అందజేస్తారని తెలిపారు. జైనూరు ఘటన పూర్వపరా లను గ్రామస్థులను అడిగి తెలుసుకుంటారన్నారు. ఎమ్మెల్సీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్‌, మాజీ సర్పంచులు మడాడి భీంరావ్‌, మేస్రాం రాహుల్‌, కుంర శాంరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 10:49 PM