Kumaram Bheem Asifabad : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:18 PM
ఆసిఫాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాంకిడి మండలం గోయగాం గోండు గూడకు చెందిన రాంషావ్ తనకు దివ్యాంగ పెన్షన్ ఇప్పించాలని అర్జీ సమర్పించాడు. ఆసిఫాబాద్ పట్ట ణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అన్నం సత్తమ్మ ప్రజా పాలన దరఖాస్తులో తన ఆధార్ నెంబరు తప్పుగా వచ్చిందని సరిచేయాలని దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం గంభీరావుపేటకు చెందిన శివయ్య తనతండ్రి పేరిట ఉన్న మండలంలోని దోండ్ల, ఏదుల పహాడ్ గ్రామశివారులో గల భూమిని తన సోదరుల పేరిట సమానంగా పట్టాచేయాలని ఆర్జీ సమర్పిం చాడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా దామోర్మి తాలూకా టాకిరి గ్రామానికి చెందిన శ్రీదేవి వాంకిడి శివా రులో గల పట్టాను రద్దుచేయాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాంబస్తీకి చెందిన శారద తన భర్త పుట్టుకతో శారీరక దివ్యాంగుడు అయినం దున తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలం సదాశివపేటకు చెందిన హరిదాస్ తనకు స్వయం ఉపాధి పొందటానికి బ్యాంకురుణం ఇప్పించాలని, చింతలమానేపల్లి మండలం కర్జవెల్లికి చెందిన జనాబాయి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్‌కు చెందిన మీరారాణి మండల్ తన సోదరులు తనకు తెలియ కుండా తనపేరిట గల పట్టాను వారిపేరిట చేసుకున్నా రని పరిశీలించి న్యాయం చేయాలని అర్జీలు సమ ర్పించారు. ఆసిఫాబాద్ మండలం తుమరిగూడకు చెందిన సుందరబాయి తన భర్త మరణించి నందున తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని దర ఖాస్తు అందజేశారు.
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి..
సనాతన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడు కోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందాపూర్‌లో గల పోతరాజు ధర్మరాజు దేవస్థానజాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 15నుంచి 17వరకు జరుగనున్న జాతరనుఅధికారులు, సభ్యులు విజయ వంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు రాజు, ధర్ము, దేవ్‌రావు, రాము తదితరులు పాల్గొన్నారు.