Kumaram Bheem Asifabad: లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:24 PM
వాంకిడి/సిర్పూర్(టి), జనవరి 16(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వపథకాల సర్వేను పకడ్బం దీగా నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.

వాంకిడి/సిర్పూర్(టి), జనవరి 16(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వపథకాల సర్వేను పకడ్బం దీగా నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. గురువారం ఆయన వాంకిడి మండలకేంద్రంలో, సిర్పూర్(టి) మండలం లోని గోవింద్‌పూర్‌లో చేపడుతున్న రేషన్ కార్డులు, ఆత్మీయభరోసా, ఇందిరమ్మఇండ్లు, రైతుభరోసా సర్వేలను పరిశీలించారు. రైతు భరోసాకింద రాళ్లుగుట్టలు సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను నమోదు చేయ కూడదన్నారు. నిర్ణీతగడువులోగా సర్వేను పూర్తిచేసి, జాబితాను రూపొందించి గ్రామ సభల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి భూక్య, తహసీల్దార్ రియాజ్‌అలీ, ఎంపీవో అజీజుద్దీన్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సోమేష్, కార్యదర్శి శివ, సర్వేయర్ రామకృష్ణ, సిర్పూర్ (టి)లో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో గిరీష్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక సర్వేను గురు వారం అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హుల జాబితాను సక్రమంగా రూపొందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, తహసీ ల్దార్ కిరణ్, ఏపీవో బుచ్చయ్య, సిబ్బంది, ఏవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: ఈనెల 26నుంచి ప్రారంభించే నాలుగు కొత్తపథకాలకు లబ్ధిదారులను పారదర్శ కంగా ఎంపిక చేయా లని తహసీల్దార్ భూమేశ్వర్ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21నుంచి గ్రామసభ లలో లబ్ధిదారుల జాబితా ఆమోదం పొందాలని సూచిం చారు. సర్వేలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో గౌరీశంకర్, ఏవో నాగరాజు, ఏపీవో రాజన్న తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి/దహెగాం/తిర్యాణి: మండ లాల్లో చేపడుతున్న సర్వేను తహసీల్దార్లు దత్తు ప్రసాద్‌రావు, సూర్యప్రకాష్, ఎంపీడీ వోలు అంజద్‌పాషా, రాజేందర్, మల్లేష్ గురువారం పరిశీలించారు. సర్వేను పార దర్శకంగా చేపట్టాలన్నారు. రైతుభరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యంలేని భూముల వివరాలు నమోదు చేయకూడ దన్నారు.
వివిధ పథకాలపై ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కింద తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదన్నారు. రాళ్లు, గుట్టలు గల భూములను పరిశీలించాలని సూచించారు. రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేయాలని తెలిపారు.