Share News

Kumaram Bheem Asifabad: రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:20 PM

ఆసిఫాబాద్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad:  రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

- రాష్ట్రరవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఆసిఫాబాద్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్‌ అన్నారు. శనివారం హైదరా బాద్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, పోలీసుకమిషనర్లు, రవాణా శాఖాధికారులు, ఆర్టీసీఅధికారులు, విద్యాశాఖ అధికారు లతో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల31వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రహదారి భద్రత మాసోత్సవాలను విజయ వంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రహదారి భద్రత నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రహ దారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవా లన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో రోడ్డుభద్రతపై అవగాహనకేంద్రాల ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌నుంచి కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారి భద్రత మాసో త్సవాలను సంబంధిత అధికారుల సమ న్వయంతో జిల్లాలో కొనసాగిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే 45ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నియంత్రణకు అవసరమైనచర్యలు చేపడతామన్నారు. మూలమలుపు, వేగనిరోధకాలు, ఇతరప్రాంతాల్లో సూచి కలను ఏర్పాటు చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖఅధికారి రాంచందర్‌, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, రోడ్లు భవానాల శాఖాధికారి సురేం దర్‌, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యుల్డ్‌ కులాల ఉపసంచాలకులు సజీవన్‌, ఆర్టీసీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:20 PM