Kumaram Bheem Asifabad: ఆపరేషన్ స్మైల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:20 PM
ఆసిఫాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): బాలల సంక్షే మంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహిం చాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): బాలల సంక్షే మంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహిం చాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి పోలీసు, రెవెనూ, కార్మిక,విద్య,వైద్యశాఖల అధికారులు, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు, బాలల పరిర క్షణ అధికారులు, బాలలసంక్షేమకమిటీ ప్రతి నిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల1నుంచి 31వరకుఆపరేషన్ స్మైల్-11 కార్యక్ర మాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యం గా 14ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలు ఎట్టి పరిస్థితుల్లో బాలకార్మికులుగా ఉండకూడదన్నారు. ఇటుక బట్టీల తయారీ, ఇతర పరిశ్రమలు, హోటళ్లు, వ్యవసాయరంగం, ఇతర ఏ రంగంలో అయిన బాల కార్మికులను నియమించుకుంటే సంబంధిత యజమా నులపై కేసు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా బాల కార్మికులు పనులలో ఉంటే చైల్డ్‌కేర్ నంబరు 1098కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, ఎస్పీ అభివృద్ధి అధికారి సజీవన్, బాలల సంరక్షణ అధికారి మహేష్, తదితరులు పాల్గొన్నారు.