Kumaram Bheem Asifabad: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి: ఎంవీఐ
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:09 PM
వాంకిడి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిం చాలని ఎంవీఐ మోహన్ అన్నారు.

వాంకిడి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిం చాలని ఎంవీఐ మోహన్ అన్నారు. శుక్ర వారం మండలంలోని ఇందాని చౌరస్తా వద్ద రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు అవగా హన కల్పించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ వాహనదారులు మితిమీ రిన వేగంతో నడపకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల, ఓవర్ టేక్ చేయడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్టు ధరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐ రాజమల్లు, చంద్రశేఖర్, కానిస్టేబుల్‌రవి,వాజీద్ తదితరులు పాల్గొన్నారు.