Share News

Kumaram Bheem Asifabad: పోతరాజు ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:22 PM

కెరమెరి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండ లంలోని ఇందాపూర్‌ గ్రామసమీపంలో గల పోతరాజు ఆలయానికి భక్త జనం పోటెత్తింది.

Kumaram Bheem Asifabad: పోతరాజు ఆలయానికి పోటెత్తిన భక్తులు

- మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కెరమెరి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండ లంలోని ఇందాపూర్‌ గ్రామసమీపంలో గల పోతరాజు ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె గిరిజన సంప్రదాయ రీతిలో ప్రత్యేకపూజలు చేపట్టారు. మహా జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు మహారాష్ట్రనుంచి సైతం భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజనులు తమ సంప్ర దాయ రీతిలో లక్ష్మిపూజ చేశారు. పోతరాజు ధర్మరాజు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నవఽ దాన్యాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించారు. కొత్త నువ్వుల నూనెతో దీపం వెలిగించారు. అలాగే ప్రతియేటా ఇక్కడ నిర్వహించే కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ మోతీరాం, మాజీ జడ్పీటీసీ ధ్రుపతాబాయి, మాజీ వైస్‌ఎంపీపీ అబ్దుల్‌ కలాం తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సీఐ సత్యనారాయణ, ఎస్సై విజయ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు సిడాం రాజు, సిడాం ధర్ము, పాండు రంగు, రాము, ఆత్రం ఆనంద్‌ రావు, సిడాం వంశీ యులు, తది తరులు పాల్గొ న్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:22 PM