Kumaram Bheem Asifabad: సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:16 PM
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం మండలంలోని కుటోద గ్రామంలో భీమయ్యక్ ఆలయంలో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనం తరం ఆలయంవద్ద రూ.2.5లక్షలతో ఏర్పాటుచేసిన నీటి సరఫరా విద్యుత్ మోటారును ప్రారంభించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కబడ్డీపోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకు న్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌చైర్మన్ అలీబీన్ అహ్మద్, నాయకులు శంకర్, తిరుపతి, జంగు,పావుగా, భీము, రాము,సోము, జైతు పాల్గొన్నారు.