Share News

Kumaram Bheem Asifabad: నేటి నుంచి బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:12 PM

బెజ్జూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లా అడవులు అటవీసంపద, జీవవైవిధ్యంతోపాటు వివిధ రకాలపక్షులు,వణ్యప్రాణులకు పెట్టిందిపేరు.

Kumaram Bheem Asifabad:  నేటి నుంచి బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3

బెజ్జూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లా అడవులు అటవీసంపద, జీవవైవిధ్యంతోపాటు వివిధ రకాలపక్షులు,వణ్యప్రాణులకు పెట్టిందిపేరు. జిల్లాలో అటవీశాఖ అధికారులు వివిధరకాల పక్షిజాతులను గుర్తించేందుకు బర్డ్‌వాక్‌ఫెస్టివల్‌-3ని ఈనెల18,19 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నోరకాల పక్షిజాతులను కనుగొనేందుకు జిల్లాకు 20మంది ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు, ఫొటో,వీడియోగ్రాఫర్లు రానున్నట్లు అటవీఅధికారులు పేర్కొంటున్నారు. వీరంతా జిల్లా లోని పెంచికలపేట,సిర్పూర్‌(టి),కాగజ్‌నగర్‌ మండ లాల్లోని అటవీప్రాంతాలను సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో ఉన్నపక్షిజాతులపై అధ్యయనం చేస్తారు.

అరుదైన పక్షులకు ఆలవాలం..

ఈసారి నిర్వహించే బర్డ్‌వాక్‌లో మరిన్ని పక్షిజా తులు కనుగొనేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోం ది. ఈప్రాంతంలో అరుదైన పక్షిజాతుల్లో పెర్యూరైన్‌ పాల్కన్‌, బ్రౌన్‌ శ్రెరో, బ్రౌన్‌ రాక్‌చాట్‌, బ్ల్యూత్రాట్‌, బ్లాక్‌ బెల్లిడ్‌టర్న్‌, రుడ్డీ షెల్డ్‌డర్‌, సౌతర్న్‌ గ్రేశ్రెర్‌, అలెగ్జాండర్‌ ప్యారా కెప్ట్‌ వంటి పక్షిజాతులు ఇక్కడ ఉన్నాయనిగుర్తించారు. అంతేకాకుండా శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చే వలసపక్షులు కూడా ఇక్కడ ఆవాసంగా ఉన్నాయి. ఇవిఎక్కువగా అన్ని ప్రాంతా ల్లో కనిపించవని అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ర్టాల్లో అరుదుగా ఉండే పక్షిజాతులకు ఈ ప్రాంతం నిలయంగా ఉందని చెప్పవచ్చు. పక్షులను చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుందని అధికారులు బావిస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం..

- సుశాంత్‌ సుఖదేవ్‌, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్‌

ఈనెల18,19తేదీల్లో బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహిం చేందుకు జిల్లాలోని పలుప్రాంతాలను ఎంపిక చేశాం. ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు, పక్షిప్రేమికులు 20మంది రానున్నారు. ఇక్కడికివచ్చే ఔత్సాహికులకు అన్ని ఏర్పాట్లుచేశాం. బర్డ్‌వాక్‌తో అటవీ ప్రాంతం లోని జీవవైవిధ్యంతోపాటు పక్షిజాతులు, వివిధరకాల వన్యప్రాణులు,అటవీఅందాలను తిల కించిప్రపంచా నికి చాటిచెపేప్పందుకు ఉపయోగపడుతుంది.

Updated Date - Jan 17 , 2025 | 11:13 PM