Kumaram Bheem Asifabad: ఆరె సంఘం భవన నిర్మాణానికి కృషిచేస్తా: ఎమ్మెల్సీ దండె విఠల్
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:59 PM
సిర్పూర్(టి), జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆరెసంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండెవిఠల్ అన్నారు.

సిర్పూర్(టి), జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆరెసంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండెవిఠల్ అన్నారు. శివాజీ తల్లి జీజాబాయి జయంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండు ఏరియాలో శివాజీ జెండా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్(టి), దహెగాం మండలాల్లో ఆరె సంఘం భవన నిర్మాణానికి రూ.25లక్షలచొప్పున ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరయితే నిర్మా ణాలు చేపడుతామన్నారు. మండల కేంద్రంలో ఆరె కులస్తులు స్థలం ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. అనంతరం దుబ్బగూడ, డౌనల్‌ఏరియాలోని శివాజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆరెసంఘం నాయకులు శంకర్, సిడాం గణపతి, నానాజీ, ఎల్ములె కిశోర్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, తుల సీరాం, రాజు, అబ్దుల్ అకీల్, మోహన్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.