Kumaram Bheem Asifabad : ఆఖరి మజిలీ.. కష్టాలు తీరేదెప్పుడో?
ABN , Publish Date - Jan 18 , 2025 | 10:58 PM
అంతిమయాత్రకు అవస్థలు తప్పడం లేదు.. జిల్లా కేంద్రంలో జనాభాకు సరిపడా నాలుగు శ్మశాన వాటికలుం డాలనేది ప్రజల డిమాండ్. కానీ ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా కనీస సౌకర్యాలు లేక నిరుపయోగాంగా మారింది. దీంతో దహన సంస్కారాలను వాగులో, ఒర్రెలలో కానిచ్చేస్తున్నారు. వాగులు పొంగితే బాధలు చెప్పనలవి కాదు.

- జిల్లా కేంద్రంలో ఒకటే శ్మశానవాటిక
- అందులోనూ కనీస సౌకర్యాలు కరువు
- వాగులు, ఒర్రెలలో దహన సంస్కారాలు
అంతిమయాత్రకు అవస్థలు తప్పడం లేదు.. జిల్లా కేంద్రంలో జనాభాకు సరిపడా నాలుగు శ్మశాన వాటికలుం డాలనేది ప్రజల డిమాండ్. కానీ ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా కనీస సౌకర్యాలు లేక నిరుపయోగాంగా మారింది. దీంతో దహన సంస్కారాలను వాగులో, ఒర్రెలలో కానిచ్చేస్తున్నారు. వాగులు పొంగితే బాధలు చెప్పనలవి కాదు.
ఆసిఫాబాద్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కొన్ని సంవత్సరాల క్రితం పెద్దవాగు నదితీరాన నిర్మించిన శ్మశానవాటిక నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం మాత్రం దహన సంస్కారాలకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో శ్మశాన వాటికలను నిర్మించింది. కానీ జిల్లా కేంద్రంతోపాటు మండలంలో చాలావరకు నిర్మించిన శ్మశాన వాటికలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో మొత్తం 27గ్రామాల్లో వైకుంఠదామాలను నిర్మించగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించక పోవడంతో ప్రస్తుతం కనీసం 90శాతం వరకు వినియోగంలోకి రాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తప్పని ఇబ్బందులు..
మూడుకాలాల్లోనూ దహన సంస్కారాలకు జిల్లా కేంద్రం లోని ప్రజలకు ఇబ్బందులే. ముఖ్యంగా వర్షాకాలం దురదృష్టవ శాత్తు ఎవరైనా మరణిస్తే దహనసంస్కారాలకు నరకం చూడాల్సిందే. జిల్లా కేంద్రంలోని సుమారు 40వేలకు పైగా ఉన్న జనాభాకు కనీసం నాలుగు ప్రాంతాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలన్న డిమాండ్ ప్రజల్లో ఉంది. ఎట్టకేలకు ఒకటి నిర్మించినా అది నిరుపయోగంగా మారింది. దీంతో వాగులు, వంకలు, ఒర్రెల సమీపంలో దహన సంస్కారాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా వాగులు పొంగితే దహనసంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అఽధికారులు చొరవ చూపి శన్మానవాటికల్లో కావాల్సిన కనీస వసతులు కల్పించాలని పట్టణ పరజలు కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి..
- ప్రణయ్, ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో కనీసం నాలుగు శ్మశాన వాటికలు అవసర మున్నా ఒకటి మాత్రమే నిర్మించారు. అందులో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో అదికూడా నిరుపయోగంగా మారింది. శ్మశాన వాటికను నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తైనా నేటికీ కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా ప్రస్తుతం నిర్మించిన శ్మశాన వాటికలో కనీస వసతులు కల్పించాలి.