కమనీయం.. శివపార్వతుల కల్యాణం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:31 PM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలం ద్వారకలో దతత్రేయ, శివాలయం, నర్సాపూర్‌లో శ్రీబ్రమరాంభ సమేత దేవాలయం, మేదరిపేటలో శ్రీకాశీవిశ్వేరశ్వర, లక్ష్మీనారాయణస్వామి దేవాలయం, దండేపల్లి పద్మశాలి సంఘం భవనం లో భక్త మార్కండేయస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభోపేతంగా జరిగాయి.

దండేపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలం ద్వారకలో దతత్రేయ, శివాలయం, నర్సాపూర్‌లో శ్రీబ్రమరాంభ సమేత దేవాలయం, మేదరిపేటలో శ్రీకాశీవిశ్వేరశ్వర, లక్ష్మీనారాయణస్వామి దేవాలయం, దండేపల్లి పద్మశాలి సంఘం భవనం లో భక్త మార్కండేయస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభోపేతంగా జరిగాయి. ముందుగా నర్సాపూర్, మేదరిపేట గ్రామాల్లోని వందలాది మహిళలు మంగళహారతులతో స్వామి ఉత్సవ విగ్రహమూర్తులతో పల్లకితో బాజాభజాంత్రీలతో ఊరేగించారు. అ నంతరం దేవాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణ మధ్య కమనీయంగా జరిపించారు. భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.
లక్షెట్టిపేట (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీసాంభ శివాలయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆల యం నుంచి సాంభశివాలయం వరకు అమ్మవారి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను ప్రముఖులు తలపై ఎత్తుకుని భాజాభజంత్రీలతో శోభాయాత్రగా ఆల యానికి తీసుకువచ్చారు. వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలను జరిపారు. భక్తులకు కమిటీ సభ్యులు రాంచందర్, సత్యనారాయణ, జయప్రకాష్, వొజ్జల శ్రీనివాస్, సంకోజు శ్రీనివాస్‌ఏర్పాట్లు చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్ (ఆంధ్రజ్యోతి): పాత మంచిర్యాలలోని రామలింగేశ్వర ఆలయంలో బుధవారం కన్నుల పండగగా శివపార్వతుల కల్యాణాన్ని అర్చకులు రాజేష్‌శర్మ నిర్వహించారు. రాత్రి 12 గంటల అనంతరం స్వామివారికి బిల్వపత్రిని సమర్పించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మందమర్రిటౌన్ (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శివాలయాల్లో భక్తులు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తు లు ఆలయాలకు పోటెత్తారు. స్ధానిక అంగడి బజార్ శివ కేశవాలయం, 3వ జోన్‌లోని శివాలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. శివాల యాల్లో రాత్రి శివ పార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు.