పార్కు చేసిన బైక్ నుంచి రూ. 4.40 లక్షలు చోరీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:18 PM
పట్ట ణంలోని కూరగా యల మార్కెట్ వద్ద శుక్రవారం పార్కు చేసిన బైక్ నుంచి రూ. 4.40 లక్షలను ఇద్దరు గు ర్తుతెలియని వ్య క్తులు చోరీ చేశారు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామి అనే వ్యక్తి శుక్రవారం పట్టణంలోని ఎస్‌బీఐలో రూ. 4.40 లక్షలు విత్‌డ్రా చేశాడు.

బెల్లంపల్లి, ఫి బ్రవరి 7 (ఆం ధ్రజ్యోతి): పట్ట ణంలోని కూరగా యల మార్కెట్ వద్ద శుక్రవారం పార్కు చేసిన బైక్ నుంచి రూ. 4.40 లక్షలను ఇద్దరు గు ర్తుతెలియని వ్య క్తులు చోరీ చేశారు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామి అనే వ్యక్తి శుక్రవారం పట్టణంలోని ఎస్‌బీఐలో రూ. 4.40 లక్షలు విత్‌డ్రా చేశాడు. డబ్బులను తన ద్విచక్రవాహనం ట్యాంకు కవర్‌లో పెట్టుకుని కూరగాయలు కొనేందుకు కూరగాయల మార్కెట్ ఎదుట బైక్‌ను పార్క్ చేశాడు. ఈ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నెంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై వచ్చి పార్కింగ్ చేసిన బైక్‌లో నుంచి రూ. 4.40 లక్షలను ఎత్తుకెళ్లిపోయారు. వెంకటస్వామి కూరగాయలు కొనుక్కుని బైక్ వద్దకు వచ్చి ట్యాంకు కవర్‌లో డబ్బులు లేకపోవడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగ తన అన్న కూతురు వివాహం మరికొద్ది రోజుల్లో ఉండడంతో బ్యాంకు నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినట్లు బాధితుడు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫ ముందస్తు ప్రణాళికతోనే..
పార్కింగ్ చేసిన బైక్ ట్యాంకు కవర్ నుంచి రూ. 4.40 లక్షలు చోరీ చేసిన దుండగులు ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు నిర్ధారణ అయ్యింది. వెంకటస్వామి బ్యాంకు నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినప్పటికీ నుంచి తన బైక్ వెనకాలనే దుండగులు క్యాప్ ధరించడంతో పాటు ముఖం కనిపించకుండా మాస్కులు ధరించి అనుసరించారు. చోరీకి అవకాశం కోసం చూస్తుండగా కూరగాయల మార్కెట్ వద్ద బైక్‌పార్క్ చేయడంతో ఇదే అదునుగా భావించి బైక్ ట్యాంకు కవర్‌లో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బ్యాంకు పరిసర ప్రాంతాల్లో, కూరగాయల మార్కెట్ చౌరస్తా వద్ద నంబరు ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై అనుసరించి డబ్బులను దొంగలించిన సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలించారు.