విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకే కంటి పరీక్షలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:30 PM
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా వైద్యాధికారి సీతారాం తెలిపారు.

- జిల్లా వైద్యాధికారి సీతారాం
ఆసిఫాబాద్ రూరల్, ఫిబ్ర వరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా వైద్యాధికారి సీతారాం తెలిపారు. విద్యార్థు ల్లో దృష్టి లోపాన్ని నివారిం చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సో మవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యా ర్థులకు నేత్ర వైద్య నిపుణురా లు విశాల కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సీతారాం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్‌కె) కింద రెండు విడతలు రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు పది రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 931 మంది విద్యార్థులకు కంటి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలి పారు. వీరందరికి కంటి పరీక్షల అనంతరం అద్దాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్ర మంలో ఆర్‌బీఎస్‌కె నోడల్ అధికారి నేంద్ర, అప్తోమె ట్రిస్ట్ జగన్‌మోహన్, దినేష్ పాల్గొన్నారు.