Share News

అర్హులందరికీ ‘ఉపాధి’ కల్పించాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:52 PM

మండలంలోని గ్రామ్లా లో ఉపాధిహామీ పనులు లేవని ఏవరూ చెప్పకూడదని ఎంపీడీ వో సరోజ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్‌ మాలులో బుధవారం ఉపాదిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ సెక్రెటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అర్హులందరికీ ‘ఉపాధి’ కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో సరోజ

ఎంపీడీవో సరోజ

లక్షెట్టిపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామ్లా లో ఉపాధిహామీ పనులు లేవని ఏవరూ చెప్పకూడదని ఎంపీడీ వో సరోజ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్‌ మాలులో బుధవారం ఉపాదిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ సెక్రెటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 80మంది, మేట్‌లు ఉన్న గ్రామాల్లో 40మందికి తక్కువ కాకుండా ప్రతీరోజు పనులు చేపట్టాలన్నారు. పంచా యతీ సెక్రటరీలతో పాటు గ్రామ పెద్దల సమన్వయంతో పనులు సృష్టించుకోవాలని ఆదేశించారు. ప్రతీ గురువారం లేబర్‌ ఇంప్రూమెంట్‌ చేపట్టకపోతే సిబ్బందిపై ఉన్నతాధి కారులకు నివేదికను పంపించడంతో పాటు శాఖపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో వేణుగోపాల్‌, పంచాయతీ కార్యద ర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- ఉపాధి హామీ పనుల పరిశీలన

చెన్నూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పొక్కూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీపనులను బుధవారం ఈజీఎస్‌ ఏపీవో గంగాభవానీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు కొలతల ప్రకారం పనిచేస్తే ఒక కూలీకి రూ. 300 చెల్లించడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనిచే యాలని తెలిపారు. జాబ్‌కార్డు ఉన్న వారు పశువుల కొట్టాలు, మేకల కొట్టాలు, కోళ్ల షెడ్లు, అజోల్లా గడ్డి పెంపకం, నాడెపు కంపోస్టు ఫిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆమె వెంట టీఏ రవికుమార్‌, ఎఫ్‌ఏ వెంకటస్వామి ఉన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:52 PM