Share News

బాల్య వివాహాలు చేయడం నేరం

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:32 PM

బాల్య వివాహాలను చేయడం చట్ట రీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా బాలల సంవరక్షణ అధికారి మహేష్‌ అన్నారు.

బాల్య వివాహాలు చేయడం నేరం
సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీవో మహేష్‌

- జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను చేయడం చట్ట రీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా బాలల సంవరక్షణ అధికారి మహేష్‌ అన్నారు. రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన మైనర్‌ అమ్మాయిని జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెంది న అబ్బాయితో ఆదివారం వివాహం జరగాల్సిన ఉండగా 1098 టోల్‌ఫ్రీ నంబరుకు అందిన సమా చారం వచ్చిన మేరకు బాల రక్షణ భవన్‌ సిబ్బంది వెళ్లి వాహనాన్ని అడ్డుకున్నారన్నారు. వివాహం జరగాల్సిన మైనర్‌ బాలికను ఆసిఫాబాద్‌ సఖి కేంద్రానికి తరలించి ఇరు కుటుంబసభ్యులకు, కుల పెద్దలను పిలిపించి సోమవారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాల్య వివాహాల ద్వారా ఎదురయ్యే ఆరోగ్య, మానసిక సమస్యలను వివరిం చారు. ఈ సందర్భంగా డీసీపీవో మాట్లాడుతూ చిన్న వయస్సులో ఆడ పిల్లలకు పెళ్ళిళ్లు చేసి వారి బంగారు భవిష్యత్‌ను పాడు చేయవద్దని సూచించా రు. ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఆడ పిల్లలను చదివించి 18 సంవత్సరాల వయస్సు నిండిన తరువాతనే వివాహాలు చేయాల ని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కో ఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌, రవళి, జమున, మమత, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:32 PM