వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:35 PM
వంతెన నిర్మాణ పనులను త్వరిరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు.

- మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికలపేట, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వంతెన నిర్మాణ పనులను త్వరిరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు. ఆదివారం మండలంలోని కొండపల్లి గ్రామం నుంచి గొల్లవాడ మధ్య నూత నంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన పరిశీలించారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కార్యకర్త సత్తన్న కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్, సుధాకర్ తదితరులు ఉన్నారు.