Adilabad: ఆదివాసీ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:39 AM
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలా్‌సకు అరుదైన గౌరవందక్కింది.
15న రాష్ట్రపతి భవన్‌లో విందుకు ఆహ్వానం
ఆదిలాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలా్‌సకు అరుదైన గౌరవందక్కింది. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల వేళ ఢిల్లీలో రాష్ట్రపతి ఇవ్వనున్న విందులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానమందింది. ఈ అవకాశాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కైలాస్ సంతోషం వ్యక్తం చేశారు.
సాంఘిక శాస్త్రం బోధించే ఆదివాసీ ఉపాధ్యాయుడు కైలాస్ స్వగ్రామం మావల మండలం వాఘాపూర్. ఆయన మహాభారతాన్ని ‘పండోన్న మహాభారతం’ కథ పేరుతో గోండుభాషలోకి అనువదించారు. 119వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. కైలాస్ సేవలను ప్రశంసించారు.