Share News

Actress Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై పబ్‌లో దాడి..

ABN , Publish Date - May 31 , 2025 | 08:32 PM

Actress Kalpika Ganesh: డ్రగ్ అడిక్ట్ అంటూ తనపై దాడి కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది. గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించింది.

Actress Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై పబ్‌లో దాడి..
Actress Kalpika Ganesh

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పబ్‌కు వెళ్లిన ఆమె పబ్ సిబ్బందితో గొడవపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజమ్ పబ్‌లో తాజాగా కల్పిక గణేష్ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఈ సందర్భంగా బర్త్‌డే కేకు విషయంలో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది.


గొడవ సందర్భంగా పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని కల్పిక ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్ అడిక్ట్ అంటూ తనపై దాడి కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది. గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించింది. ఇక, కల్పిక పోస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.


కల్పిక సినిమా కెరీర్ సంగతులు..

కల్పిక గణేష్ 2009లో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ప్రయాణం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. 2013లో విడుదల అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. చివరగా అధర్వ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2023లో విడుదల అయింది. కల్పిక సినిమాలతో పాటు సీరియళ్లు కూడా చేసింది.


ఇవి కూడా చదవండి

గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి.. మహిళపై దారుణం..

మచిలీపట్నం ఘటన.. బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ పరామర్శ

Updated Date - May 31 , 2025 | 08:44 PM