Share News

Gas Delivery Boy: గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి.. మహిళపై దారుణం..

ABN , Publish Date - May 31 , 2025 | 07:14 PM

Gas Delivery Boy: మహేష్ ఇంట్లోకి వెళ్లగానే ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. అరిస్తే కత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి చూశాడు. ముఖంపై కూడా కొట్టాడు. కత్తితో పలు చోట్ల గాయపరిచాడు.

Gas Delivery Boy: గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి.. మహిళపై దారుణం..
Gas Delivery Boy

ఆడవాళ్లపై ఇంటా, బయట ఎక్కడ చూసినా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా, ఓ డెలివరీ బాయ్ ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. గ్యాస్ సిలిండర్ వేయడానికి వెళ్లి.. ఆమెతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. కత్తితో ఆమెపై దాడికి సైతం దిగాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.


బాధితురాలు పోలీస్ కంప్లైంట్‌లో తెలిపిన వివరాల మేరకు.. అనారోగ్యంగా ఉండటంతో మే 21వ తేదీన బాధితురాలు మైసూర్‌కు వెళ్లడానికి సిద్ధమైంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గ్యాస్ డెలివరీ బాయ్ మహేష్ ఆమె ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎవరు నువ్వు అని ఆ మహిళ అడగ్గా.. గ్యాస్ డెలివరీ ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. ‘ నేను గ్యాస్ బుక్ చేయలేదు’ అని ఆమె అంది. ‘ గ్యాస్ బుక్ చేయకపోయినా.. గ్యాస్ తెచ్చాను. కావాలంటే తీసుకోండి’ అని అన్నాడు.


ఆమె గ్యాస్ తీసుకోవడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే.. కేవైసీ చేయాలని అతడు చెప్పాడు. గ్యాస్ సిలిండర్ దగ్గర ఆమెను నిలబెట్టి ఫొటో తీసుకున్నాడు. ‘ కిచెన్‌లో గాలి సరిగా వస్తోందా లేదా చెక్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్’ అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. మహేష్ ఇంట్లోకి వెళ్లగానే ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. అరిస్తే కత్తితో పొడుస్తానని బెదిరించాడు.

ఆమెపై అత్యాచారం చేయడానికి చూశాడు. ముఖంపై కూడా కొట్టాడు. కత్తితో పలు చోట్ల గాయపరిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. మహేష్ దాడిలో గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. మహేష్‌పై అత్యాచారం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేష్ కోసం అన్వేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మచిలీపట్నం ఘటన.. బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ పరామర్శ

ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు.. కవిత

Updated Date - May 31 , 2025 | 07:14 PM