Share News

Medha Patkar: మూసీ నిర్వాసితులను కలిసిన మేధాపాట్కర్‌

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:13 AM

సోమవారం ఉదయం ఓల్డ్‌మలక్‌పేటలోని ఓ సామాజిక కార్యకర్త ఇంటికి వచ్చిన ఆమె ఆ తర్వాత మూసీ రివర్‌ బెడ్‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులను కలిసి మాట్లాడారు. కొంద మంది స్థానికులతో కలిసి ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Medha Patkar: మూసీ నిర్వాసితులను కలిసిన మేధాపాట్కర్‌

అనుమతి లేదంటూ పంపించి వేసిన పోలీసులు

ఓల్డ్‌మలక్‌పేట, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ మూసీ నిర్వాసితులను పరామర్శించేందుకు రాగా, అనుమతి లేకుండా రాకూడదంటూ పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. సోమవారం ఉదయం ఓల్డ్‌మలక్‌పేటలోని ఓ సామాజిక కార్యకర్త ఇంటికి వచ్చిన ఆమె ఆ తర్వాత మూసీ రివర్‌ బెడ్‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులను కలిసి మాట్లాడారు. కొంద మంది స్థానికులతో కలిసి ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల వివరాలు, అక్కడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మేధాపాట్కర్‌ సందర్శన గురించి తెలుసుకున్న పోలీసులు ఆమె ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం ఇవ్వకుండా పర్యటించడానికి అనుమతి లేదంటూ ఆమెను వాహనంలో పంపించి వేశారు.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 05:13 AM