Share News

Duddilla: కాళేశ్వరం అవినీతిపరులకు శిక్ష తప్పదు

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:01 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరం అంశాన్ని...

Duddilla: కాళేశ్వరం అవినీతిపరులకు శిక్ష తప్పదు

షాద్‌నగర్‌/నందిగామ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించనున్నట్లు ప్రకటించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో అంతరాష్ట్ర బాల్‌ బాడ్మింటన్‌ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ అగ్రనేతలపై ఆరోపణలు చేయడం వారి కుటుంబ అంతర్గత విషయమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 04:01 AM