Juvenile Crime: స్నేహం నటించి.. సామూహిక అత్యాచారం
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:53 AM
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర భారతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం నగరానికి వచ్చి హైదర్షాకోట్‌లో నివాసం ఉంటోంది. వారికి 9వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. స్థానికంగా ఉండే కొందరు మైనర్లు ఆమెతో స్నేహం చేసేవారు.

9వ తరగతి బాలికపై.. నలుగురు మైనర్ల అఘాయిత్యం
ఆరేళ్ల చిన్నారి పట్ల బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన
విహారయాత్రకు వెళ్లిన సమయంలో లైంగికదాడికి యత్నం!
ఆలస్యంగా వెలుగులోకి
నార్సింగ్, శంషాబాద్ రూరల్/మంచాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల స్నేహం నటించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు మైనర్లు. ఈ ఘటన ఈ నెల 5న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర భారతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం నగరానికి వచ్చి హైదర్షాకోట్‌లో నివాసం ఉంటోంది. వారికి 9వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. స్థానికంగా ఉండే కొందరు మైనర్లు ఆమెతో స్నేహం చేసేవారు. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఈ నెల 5న ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నార్సింగ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురు మైనర్లపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడో కామాంధుడు.
ఈ ఘటన మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్‌ఫాంట్ జీసెస్ స్కూల్‌కు చెందిన 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులను పాఠశాల యాజమాన్యం బస్సుల్లో టూర్‌కు తీసుకెళ్లింది. వికారాబాద్ జిల్లా మంచాల మండలంలోని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆరేళ్ల బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి లైంగికదాడికి యత్నించాడు. ఇంటికి వచ్చిన తరువాత జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు వెళ్లి బస్సు డ్రైవర్‌ను చితకబాదేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జోస్‌ఫరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..