Share News

Nizamabad Court Verdict: కుల దూషణ ఊరి బహిష్కరణ కేసులో..

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:40 AM

నిజామాబాద్‌లో కులం పేరుతో దూషణ, గ్రామ బహిష్కరణ కేసులో 15 మందికి ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం జైలు శిక్ష విధించారు. లాక్‌డౌన్ సమయంలో చోటు చేసుకున్న వివాదంపై గ్రామపంచాయితీ జరిమానా విధించగా కేసు నమోదు అయ్యింది.

Nizamabad Court Verdict: కుల దూషణ ఊరి బహిష్కరణ కేసులో..

15 మంది గ్రామస్థులు, వీడీసీ సభ్యులకు జైలు

ఐదేళ్ల శిక్ష, రూ.5వేల జరిమానా విధించిన కోర్టు

నిజామాబాద్‌ లీగల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కులం పేరిట దూషించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేసిన కేసులో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామానికి చెందిన 15 మందికి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టాల ప్రకారం జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ రెండో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కొలిప్యాక్‌ గ్రామానికి చెందిన ఆరోళ్ల రుక్మవ్వ 2020 ఏప్రిల్‌ 22న లాక్‌డౌన్‌ సమయంలో భర్త, కుమారుడు, కూలీలతో కలిసి గ్రామ శివారులోని తన పొలంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ట్రాక్టర్‌లో గడ్డి వేసుకొని ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్థులైన మేకల బబ్లూ, మేకల భవానితో వివాదం జరిగింది. దీంతో గ్రామాభివృద్ధి సంఘం నాయకుడు తిరుపతి, ఇతర పెద్దలు పంచాయితీ నిర్వహించి రుక్మవ్వకు జరిమానా విధించారు. దీంతో ఆమె జక్రాన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సీపీ శ్రీనివాస్‌ కుమార్‌ విచారణ నిర్వహించి.. కోర్టులో చార్జ్‌షీట్‌ సమర్పించారు. విచారణలో భాగంగా 15 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు.. 15 మంది గ్రామస్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల(వీడీసీ)పై పలు రకాల ఆరోపణలు రుజువైనట్టు నిర్ధారించింది. వారిలో కొందరికి కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా.. మరికొందరికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:40 AM