Share News

Mahabubabad: మహబూబాబాద్‌ నర్సింగ్‌ కళాశాలలో మరో 14 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:43 AM

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు చెందిన మరో 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Mahabubabad: మహబూబాబాద్‌ నర్సింగ్‌ కళాశాలలో మరో 14 మంది విద్యార్థులకు అస్వస్థత

మహబూబాబాద్‌ క్రైం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు చెందిన మరో 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారినిహుటాహుటిన జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక మెనూలో భాగంగా మొలకెత్తిన గింజలు, పల్లిపట్టీలు ఆహారంగా తీసుకున్నారు.


కాసేపటికే 10 మంది అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మరో 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం జీర్ణం కాకపోవడంతోనే అనారోగ్యం పాలయ్యారని ఆస్పత్రి వైద్యురాలు విజయశ్రీ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని చెప్పారు.

Updated Date - Jun 23 , 2025 | 03:43 AM