Dry Cannabis Seized: రీ మోడలింగ్ కార్ల మ్యాట్, సీట్ల కింద 122.85 కిలోల ఎండు గంజాయి స్మగ్లింగ్
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:29 AM
రీ మోడలింగ్ చేసిన కారు ఫ్లోరింగ్ మ్యాట్, సీట్ల కింద 122.85 కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్...
ఇద్దరు నిందితుల అరెస్టు.. 2 కార్లు.. రెండు ఫోన్లు జప్తు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రీ మోడలింగ్ చేసిన కారు ఫ్లోరింగ్ మ్యాట్, సీట్ల కింద 122.85 కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ సోమవారం మీడియాకు తెలిపారు. జిల్లాలోని కంది మండలం చేర్యాల గేటు వద్ద 3 రోజుల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారిపై చేపట్టిన తనిఖీలో టాటా విస్టా కారులో ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి ఇచ్చిన క్లూ ఆధారంగా 3 రోజులుగా ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చేర్యాల గేటు వద్ద సోమవారం అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఇండికా విస్టా డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని కారు తనిఖీ చేయడంతో డిక్కీలో 69.5 కిలోల గంజాయి, కాసేపటికి వచ్చిన మరో టాటా ఇండికా విస్టా కారు నుంచి 53.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని హరికిషన్ తెలిపారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని చాచా మహ్మద్ అనే వ్యక్తి కోసం తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్టు చెప్పారు. నిందితులు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అత్తర్ నగర్ వాసి అబ్దుల్ వహాబ్, ఒడిశాలోని గజపతి జిల్లా రాయగడలోని సంకురదా వాసి ఉమాకాంత్‌తోపాటు 2 కార్లు, 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాచా మహ్మద్‌నూ నిందితుడిగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.40 లక్షలుంటుందని హరికిషన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News