Share News

కల్వర్టును ఢీకొని టిప్పర్‌ బోల్తా

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:16 PM

ప లుగురాళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్‌ అదుపు తప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న టీవీఎస్‌ వాహ నం మీదుగా దూసుకెళ్లి, కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది.

కల్వర్టును ఢీకొని టిప్పర్‌ బోల్తా

ఖిల్లాఘణపురం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ప లుగురాళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్‌ అదుపు తప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న టీవీఎస్‌ వాహ నం మీదుగా దూసుకెళ్లి, కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది. వనపర్తి జిల్లా, ఖిల్లాఘణపురం మండల కేంద్రం శివారులో శనివారం సాయం త్రం ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. ఖిల్లాఘణపురం మం డలంలోని కర్నెతండా మైనింగ్‌ నుంచి ఆమన్‌గ ల్‌కు పలుగురాళ్లను తరలిస్తున్న టిప్పర్‌ అదు పుతప్పి రామగిరి పొలం వద్ద రోడ్డు పక్కన ని లిపి ఉన్న టీవీఎస్‌ వాహనాన్ని ఢీకొని 100 మీ టర్లు లాక్కెళ్లింది. ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. టిప్పర్‌ను మహబూబ్‌నగర్‌కు చె ందిన ఎరుకలి శివప్రసాద్‌ నడుపుతున్నాడు. అ తడు మద్యం తాగి వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపా రు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ సత్యనా రాయణ గౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకున్నా రు. డ్రైవర్‌కు డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్ష చేశారు. అత డిని అదుపులోకి తీసుకొని, వాహనాన్ని స్టేషన్‌ కు తరలించారు.

Updated Date - Mar 08 , 2025 | 11:16 PM