ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:34 PM
బండ రాయిపాకులలో 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో సర్పంచ్, ఎంపీటీసీలకు పోటీ చేసే అవకాశం రాలేదని, ఈసారి మా గ్రామం లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరు తూ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యం లో ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతి పత్రం అంద జేశారు.

రేవల్లి, పిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : బండ రాయిపాకులలో 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో సర్పంచ్, ఎంపీటీసీలకు పోటీ చేసే అవకాశం రాలేదని, ఈసారి మా గ్రామం లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరు తూ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యం లో ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతి పత్రం అంద జేశారు. ఈ విషయంలో నేను నా వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే తెలిపినట్లు యువజన సంఘం అధ్యక్షుడు మిద్దె నరసిం హ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్య క్షుడు బంగారయ్య, ప్రధాన కార్యదర్శి రాము లు, గ్రామస్థులు మహేష్, రాములు, బాల్‌రా జు, మహేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు