Wifi Free: పబ్లిక్ వైఫై వాడేవారు పాటించాల్సిన జాగ్రత్తలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:46 PM
ప్రయాణాల్లో పబ్లిక్ వైఫైలు వాడక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణాలప్పుడు పబ్లిక్ వైఫై సేవలను ఒక్కోసారి వినియోగించాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో విశ్వసనీయమైన వైఫై నెట్వర్క్‌ను వెతుక్కోవడం ఒకెత్తైతే ఆ తరువాత వైఫై వాడే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఎటువంటి టెన్షన్ లేకుండా వైఫైని వినియోగించుకోవచ్చి నిపుణులు చెబుతున్నారు (free wi-fi hotspots).
పబ్లిక్ ప్లేసుల్లో చాలా చోట్ల ఫ్రీ వైఫై అందబాటులో ఉంటుంది. వైఫై సేవలు అందుబాటులో ఉండే ప్రాంతాలు లేదా డివైజ్‌లను హాట్‌స్టా్ట్ అని అంటారు. ఇవి రెండు రకాలు. మొబల్ హాట్‌స్పాట్ మొదటిది కాగా పబ్లిక్ హాట్‌స్పాట్ రెండవది (connect to free wi-fi safely).
స్మార్ట్ ఫోన్ ద్వారా మొబైల్ హాట్‌స్పాట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో టెలికం కంపెనీలు వీటిని ఏర్పాటు చేస్తాయి. ఇక కాఫీ షాపులు, మాల్స్, ఎయిర్‌పోర్టులు, లైబ్రరీలు, హోటల్స్‌లో పబ్లిక్ హాట్‌స్పాట్‌లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల కోసం ఆయా సంస్థలు వీటిని అందుబాటులో ఉంచుతాయి.
పార్కులు, మ్యూజియాలు, జిమ్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి అనేక చోట్ల పబ్లిక్ హాట్‌స్పాట్ ద్వారా ఉచిత వైఫై పొందొచ్చు. ఇన్‌స్టా బ్రిడ్జ్, వైఫై మ్యాప్, వైఫై అరౌండ్ వంటి యాప్స్ ద్వారా పబ్లిక్ వైఫై హాట్ స్పాట్స్‌ను గుర్తించొచ్చు. కొన్ని వైఫై హాట్ స్పాట్స్‌కు కనెక్ట్ అయ్యేందుకు కొన్ని సార్లు వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉండొచ్చు. ఇందుకు సంబంధించిన లొకేషన్లు ఆయా హాట్‌స్పాట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ హాట్ స్పాట్స్ వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పబ్లిక్ వైఫై ద్వారా నెట్ బ్యాంకింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేయకూడదు. వీటి ఎన్‌క్రిప్షన్ కారణంగా పాస్‌వర్డ్స్ ఇతర విషయాలను సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన సాఫ్ట్ వేర్‌లను కూడా ఫోన్‌లల్లో ఇన్ స్టాల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి, పబ్లిక్ వైఫైని వాడేవారు అదనపు భద్రత కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిశ్చితంగా పబ్లిక్ వైఫైని వాడొచ్చు.
ఇవి కూడా చదవండి
సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..
విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..
Read Latest and Technology News