Share News

జాతీయస్థాయి క్రీడాకారులకు ఘన సన్మానం

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:35 PM

గతనెల 7న హైదరాబాద్‌లో షూటింగ్‌బాల్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు.

జాతీయస్థాయి క్రీడాకారులకు ఘన సన్మానం
క్రీడాకారులను సన్మానిస్తున్న గోపాలం, సత్య ఆంజనేయులు

మక్తల్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : గతనెల 7న హైదరాబాద్‌లో షూటింగ్‌బాల్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ క్రీడలకు 11మంది ఎంపికైనట్లు షూటింగ్‌బాల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, జిల్లా అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. ఆదివారం మినీ స్టేడియంలో క్రీడాకారులు గాయత్రి, శ్రీలత, స్వప్న, పరశురాం, జూనియర్‌ విభాగంలో శ్రా వణి, రాజేష్‌, రఘు, అఖిల, నవ్యను సన్మా నించారు. ఈనెల 21 నుంచి 23వరకు నల్గొండ జిల్లాలో జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా షూటింగ్‌బాల్‌ అధ్యక్షుడిగా ఎంపికైన సత్య ఆంజనేయులును సన్మానిం చారు. కార్యక్రమంలో పీఈటీ శ్రీలత, ఓబ్లేష్‌, శి వకుమార్‌, తిప్పన్న, నర్సింహులు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:35 PM