Share News

రూ.43 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:48 PM

పట్టణంలో రూ.43 కోట్లతో ప లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.

రూ.43 కోట్లతో అభివృద్ధి పనులు
అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో రూ.43 కోట్లతో ప లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం మునిసిపల్‌ చైర్మన్‌ పుట్టపాకల మహేష్‌తో కలి సి అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థా పనలు చేశారు. మొదట పట్టణంలోని బాలన గర్‌ ఎర్రగుట్ట కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లతో కలిసి, సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాళ్ల కోసం, డ్రైనేజీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపడతామ ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మునిసిపల్‌ వైస్‌చైర్మ న్‌ కృష్ణయ్య, వనపర్తి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, చీర్ల చందర్‌, వాకిటి ఆదిత్య, స తీష్‌, కౌన్సిలర్లు, మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణ చందర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:48 PM