Share News

ChatGPT: చాట్‌జీపీటీ సూసైడ్ నోట్.. యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 21 , 2025 | 09:15 PM

చాట్‌జీపీటీ సాయంతో సూసైడ్ నోట్ రాయించుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది. చాట్‌జీపీటీ స్వతంత్రంగా ఓ కౌన్సిలర్‌గా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని యువతి తల్లి ఆరోపించింది.

ChatGPT: చాట్‌జీపీటీ సూసైడ్ నోట్.. యువతి ఆత్మహత్య
ChatGPT suicide note controversy

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ సాయంతో సూసైడ్ నోట్ రాసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో తాజాగా చోటుచేసుకుంది. చాలా కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న సోఫీ రోటెన్‌బర్గ్ కౌన్సెలింగ్ కోసం చాట్‌జీపీటీ వైపు మళ్లింది. చివరకు ఆత్మహత్యకు నిర్ణయించింది. అయితే, తన వాళ్లకు సాంత్వన చేకూర్చేలా ఓ సూసైడ్ నోట్ రాసి ఇవ్వాలని చాట్‌జీపీటీని కోరింది. ఆ తరువాత ఆ సూసైడ్ లేఖను ఇంట్లో వదిలిన సోఫీ తాను మరో చోటకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది ChatGPT suicide note controversy).

చాట్‌జీపీటీ తీరుపై సోఫీ తల్లి లారా మండిపడింది. ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలు చేస్తుంటే అధికారులను అలర్ట్ చేయడమో లేదా వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడమో చేయాలి కానీ చివరి వరకు విషయాన్ని చాట్‌జీపీటీ ఎలా దాచిపెట్టగలిగిందని ఆమె కన్నీరుమున్నీరైంది.

గత ఏడాది అక్టోబర్ నుంచి సోఫీకి మానసిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో, ఆమె జాబ్‌కు రాజీనామా చేసి విహారయాత్రపై విదేశాలకు వెళ్లి వచ్చింది. ఆ తరువాత అమెరికాలో ఎన్నికల సీజన్ కావడంతో ఉద్యోగాలు లభించలేదు. దీంతో, ఆమెకు మానసిక ఒత్తిడి ఎక్కువైంది. దీంతో, ఆమె చాట్‌జీపీటీ సాయం తీసుకుంది. రెడిట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న కొన్ని సూచనలు ఇచ్చి చాట్‌జీపీటిని స్వతంత్ర కౌన్సిలర్‌లా వ్యవహరించమని సూచించింది. ఆమె చెప్పినట్టే ఏఐ చాట్‌బాట్ చేసింది (AI ethics and suicide).


ఆ తరువాత ఆమె తన మనసులో విషయాలన్నీ చాట్‌జీపీటీతో పంచుకుంది. తన అసలు కౌన్సిలర్, తల్లిదండ్రుల నుంచి కూడా ఈ విషయాన్ని దాచిపెట్టింది. ఆత్మహత్య ఆలోచనల గురించి పంచుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబర్‌లో ఓ జాబ్ లభించింది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని ఆశపడింది. కానీ అది రిమోట్ వర్క్ కావడంతో ఆమె నిరాశమరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించినా చివరి నిమిషంలో తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. కానీ ఇటీవల ఆమె ఆలోచనలు కట్టుతప్పాయి. చివరకు చాట్‌జీపీటీ సాయంతో ఓ సూసైడ్ నోట్ రాయించుకుంది. తన మరణంతో కలిగే వేదన నుంచి కుటుంబసభ్యులకు సాంత్వన లభించే రీతిలో లేఖ రాయించుకుని ఇంట్లో వదిలిపెట్టి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..

Read Latest and Technology News

Updated Date - Sep 21 , 2025 | 09:25 PM