Share News

Zimbabwe vs New Zealand: కుప్పకూలిన జింబాబ్వే

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:54 AM

జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌటైంది. బ్రెండన్‌ టేలర్‌ (44) రాణించాడు...

Zimbabwe vs New Zealand: కుప్పకూలిన జింబాబ్వే

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌

బులవాయో : జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌటైంది. బ్రెండన్‌ టేలర్‌ (44) రాణించాడు.. హెన్రీ ఐదు, జకారీ ఫోక్స్‌ నాలుగు వికెట్లతో చెలరేగారు. అనంతరం కివీస్‌ తొలిరోజు ఆటచివరికి 174/1 స్కోరుతో తిరుగులేని స్థితిలో నిలిచింది. 49 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌కు ఇంకా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి.

టేలర్‌ రికార్డు: జింబాబ్వే బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. 21వ శతాబ్దంలో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసి ఎక్కువ సంవత్సరాలు (21 సంవత్సరాల 93 రోజులు) కెరీర్‌ కొనసాగించిన క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్‌ అండర్సన్‌ (21 సంవత్సరాల 51 రోజులు)ను అధిగమించాడు. 39 ఏళ్ల టేలర్‌ 2004లో శ్రీలంకపై సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 02:54 AM