Duleep Trophy 2025: యష్ రజత్ శతకాలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:34 AM
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ రెండో రోజే పట్టు బిగించింది. యష్ రాథోడ్ (137 బ్యాటింగ్), కెప్టెన్ రజత్ పటీదార్ (101) శతకాల సహాయంతో..
సెంట్రల్ జోన్ 384/5 ఫ ‘సౌత్’తో దులీప్ ట్రోఫీ ఫైనల్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ రెండో రోజే పట్టు బిగించింది. యష్ రాథోడ్ (137 బ్యాటింగ్), కెప్టెన్ రజత్ పటీదార్ (101) శతకాల సహాయంతో.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 384/5 స్కోరు సాధించింది. ప్రస్తుతం జట్టు 235 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ మలేవర్ (53) హాఫ్ సెంచరీ చేయగా, క్రీజులో యష్‌తో పాటు సారాంశ్ (47 బ్యాటింగ్) ఉన్నాడు. లెఫ్టామ్ పేసర్ గుర్జ్‌పనీత్‌కు మూడు వికెట్లు దక్కాయి. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News