Yarraji Jyothi Frustration: నా ఆవేదనను అర్థం చేసుకోండి
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:11 AM
తొమ్మిదిసార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు. దేశ ప్రతిష్ట కోసం పదేళ్లగా చెమటోడుస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించకపోవడం ఆమె దురదృష్టం. ఏ భారతీయ క్రీడాకారిణి...
యర్రాజి జ్యోతి
తొమ్మిదిసార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు. దేశ ప్రతిష్ట కోసం పదేళ్లగా చెమటోడుస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించకపోవడం ఆమె దురదృష్టం. ఏ భారతీయ క్రీడాకారిణి సాధించని రికార్డులు సొంతం చేసుకున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ యర్రాజి జ్యోతి పడుతున్న ఆవేదన సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
పరిగెత్తేందుకు మంచి బూట్లు కూడా లేని స్థితి నుంచి మొదలెట్టి.. ఈ రోజు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నా. అయినా ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం బాధగా ఉంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మా నాన్నకి వచ్చే రూ.6 వేల జీతంతోనే కుటుంబం నడిచేది. ఎన్నో కష్టాల్ని అధిగమించి, బాధలు దిగమింగి పట్టుదలతో శ్రమిస్తున్నా. ఇన్ని పతకాలు సాధించిన నాకే సరైన గుర్తింపు, గౌరవం లేకపోతే పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన చిన్నారులు.. క్రీడలను కెరీర్‌గా ఎలా ఎంచుకోగలుగుతారు? ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జూనియర్ క్లర్క్‌గా పని చేస్తున్నా. నా కంటే జూనియర్లకు కూడా నిబంధనలతో సంబంధం లేకుండా భారీ నజరానాలు, ప్రోత్సాహకాలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. కానీ, నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు పాలసీలు, జీఓలు అడ్డు వస్తున్నాయో అర్థం కావడం లేదు. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నాకు సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నా.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ