Share News

WPL 2026: మెగా వేలం.. లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Nov 27 , 2025 | 04:01 PM

డబ్ల్యూపీఎల్ 2026 సంబంధించిన మెగా వేలం ఢిల్లీ వేదికగా మొదలైంది. ఈ మెగా ఆక్షన్‌ను మల్లికా సాగర్ నిర్వహిస్తున్నారు. ఈ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

WPL 2026: మెగా వేలం.. లైవ్ అప్‌డేట్స్
WPL 2026

Live News & Update

  • Nov 27, 2025 20:54 IST

    ప్రతీక రావల్‌ను రూ.50 లక్షలకు తీసుకున్న గుజరాత్

    • ఇంతకు ముందు అన్‌సోల్డ్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ ప్రతీక

    • వేలంలో తిరిగి రూ.50లక్షలకు తీసుకున్న గుజరాత్

  • Nov 27, 2025 20:51 IST

    సైకా ఇషాక్‌ను తీసుకున్న ముంబై

    ఇషాక్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న ముంబై

    జి. త్రిషను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ

    ప్రత్యుష కుమార్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ

  • Nov 27, 2025 20:26 IST

    అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్‌కు రూ.20 లక్షలు

    • భారత అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్‌ త్రివేణి వశిష్ఠను రూ.20 లక్షలకు తీసుకున్న ముంబై

    • సుమన్ మీనాను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ

    • గౌతమి నాయక్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ

  • Nov 27, 2025 20:20 IST

    క్లో ట్రైయాన్‌కు రూ.30 లక్షలు

    సౌతాఫ్రికా ప్లేయర్ ట్రైయాన్‌ను తీసుకున్న యూపీ

    లక్కీ హమిల్టన్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఢిల్లీ

  • Nov 27, 2025 20:19 IST

    యూఎస్ఏ ప్లేయర్‌ను తీసుకున్న యూపీ

    • యూఎస్ఏ ప్లేయర్ తారా నోరిస్‌ను రూ. 10 లక్షలకు జట్టులోకి తీసుకున్న యూపీ

  • Nov 27, 2025 20:14 IST

    యాస్తికా భాటియాకు రూ.50 లక్షలు

    • యాస్తికాను తీసుకున్న గుజరాత్

    • సిమ్రాన్ షేక్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 20:11 IST

    భారత బ్యాటర్ ప్రతీక రావల్ అన్‌సోల్డ్

    • ప్రతీక బేస్ ధర రూ.50 లక్షలు

    • ప్రతీకను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 20:10 IST

    అన్‌క్యాప్‌డ్‌ వికెట్‌కీపర్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ

    • భారత అన్‌క్యాప్‌డ్ వికెట్‌కీపర్ శిప్రా గిరిని రూ.10 లక్షలకు జట్టులోకి తీసుకున్న యూపీ

    • మమత మదివాలాను రూ.10 లక్షలకు తీసుకున్న ఢిల్లీ

    • హ్యాపీ కుమారిని రూ.10 లక్షలకు తీసుకున్న గుజరాత్

    • నందని శర్మను రూ.20 లక్షలకు తీసుకున్న ఢిల్లీ

  • Nov 27, 2025 20:09 IST

    గ్రెస్ హారిస్‌కు రూ.75 లక్షలు

    • ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రెస్ హారిస్ బేస్ ధర రూ.30 లక్షలు

    • ఈమెను రూ.75 లక్షలకు జట్టులోకి తీసుకున్న బెంగళూరు

    • మరోసారి అన్‌సోల్డ్ అయిన ఎస్. మేఘన, అమీ జోన్స్, డార్సి బ్రౌన్‌, అలానా కింగ్, వింద్రా దినేశ్‌

  • Nov 27, 2025 19:58 IST

    ఇంకా ఏ జట్టులో ఎన్ని స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయంటే?

    • ఢిల్లీ 6.. మిగిలిన పర్స్ రూ.80 లక్షలు

    • ముంబై 7.. మిగిలిన పర్స్ రూ.80 లక్షలు

    • గుజరాత్ 7.. మిగిలిన పర్స్ రూ. 2.55 కోట్లు

    • బెంగళూరు 6.. మిగిలిన పర్స్ రూ.1.25 కోట్లు

    • యూపీ 7.. మిగిలిన పర్స్ రూ.1.45 కోట్లు

  • Nov 27, 2025 19:24 IST

    అనుష్క శర్మకు రూ.45 లక్షలు

    • ఈమె కనీస ధర రూ.10 లక్షలు

    • రూ.45 లక్షలకు జట్టులోకి తీసుకున్న గుజరాత్

  • Nov 27, 2025 19:23 IST

    జార్జియా వేర్‌హమ్‌కు రూ.కోటి

    ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్‌హమ్‌ను తీసుకున్న గుజరాత్ ఆమె కనీస ధర రూ.50 లక్షలు

    జార్జియాను రూ.కోటికి దక్కించుకున్న గుజరాత్

  • Nov 27, 2025 19:14 IST

    తనూజాను తీసుకున్న గుజరాత్

    భారత ఆల్‌రౌండర్ తనూజా కన్వర్‌ను రూ.45లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్ జట్టు

  • Nov 27, 2025 19:12 IST

    కనికా అహుజాను తీసుకున్న గుజరాత్

    • కనికాను రూ.30 లక్షలకు తీసుకున్న గుజరాత్

    • రహిలాను రూ.10 లక్షలకు తీసుకున్న ముంబై

  • Nov 27, 2025 19:09 IST

    భారత బౌలర్ అన్‌సోల్డ్

    రాజేశ్వరి గైక్వాడ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 19:07 IST

    పుజా వస్త్రాకర్‌కు రూ..85 లక్షలు

    • కనీస ధర రూ.50 లక్షలు

    • పుజాను రూ.85 లక్షలకు పాడి దక్కించుకున్న ఆర్సీబీ

    • తానియా భాటియాను రూ.30 లక్షలకు కొనుగోలు చేసుకున్న ఢిల్లీ జట్టు

  • Nov 27, 2025 19:05 IST

    సంజీవన్‌ సంజనకు రూ.50 లక్షలు

    • భారత క్రికెటర్ సంజీవన్ సంజనను కొనుగోలు చేసిన ఎంఐ

    • రూ.50 లక్షలకు జట్టులోకి తీసుకున్న ముంబయి ఇండియన్స్

  • Nov 27, 2025 19:04 IST

    ఆర్సీబీకి అరుంధతి రెడ్డి

    • టీమిండియా ఆల్‌రౌండ్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిని కొనుగోలు చేసిన బెంగళూరు

    • ఆమె కనీస ధర రూ.30 లక్షలు

    • అరుంధతీని రూ.75 లక్షలకు దక్కించుకున్న ఆర్సీబీ

  • Nov 27, 2025 19:03 IST

    శిఖా పాండేకు క్రేజీ ప్రైజ్

    • భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేను భారీ ధరకు తీసుకున్న యూపీ

    • ఆమె కనీస ధర రూ.40 లక్షలు

    • శిఖా కోసం పోటీ పడ్డ ఆర్సీబీ, యూపీ

    • చివరకు రూ.2.40 కోట్లు పెట్టి తన జట్టులోకి తీసుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 18:59 IST

    కాశ్వీ గౌతమ్‌కు రూ.65 లక్షలు

    • భారత ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్‌ను కొనుగోలు చేసిన గుజరాత్ కనీస ధర రూ.30 లక్షలు

    • ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించి రూ.65 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్

  • Nov 27, 2025 18:58 IST

    డియండ్రా డాటిన్‌కు రూ.80 లక్షలు

    • వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియండ్రా డాటిన్‌ను కొనుగోలు చేసిన యూపీ

    • కనీస ధర రూ.50 లక్షలు

    • డాటిన్‌ను రూ.80 లక్షలకు దక్కించుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 18:53 IST

    ఆ భారత బ్యాటర్లు అన్‌సోల్డ్

    స్నేహదీప్తి, మోన మిశ్రమ్, ప్రియ పునియా అన్‌సోల్డ్

  • Nov 27, 2025 18:45 IST

    ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

    • ముంబై 10

    • ఢిల్లీ 7

    • ఆర్సీబీ 8

    • గుజరాత్ 12

    • యూపీ 9

  • Nov 27, 2025 18:10 IST

    ఇంకా ఏ జట్టు వద్ద ఎంత పర్స్?

    • గుజరాత్ రూ.5.4 కోట్లు

    • యూపీ రూ.4.65 కోట్లు

    • ముంబయి రూ.1.95 కోట్లు

    • ఆర్సీబీ రూ.2.85 కోట్లు

    • ఢిల్లీ రూ.1.1 కోట్లు

  • Nov 27, 2025 18:00 IST

    అన్‌సోల్డ్ అయిన అన్‌క్యాప్‌డ్ బౌలర్లు

    హ్యాపీ కుమారి, నందని శర్మ, కోమల్‌ప్రీత్ కౌర్, షబ్నమ్ షకిల్, ప్రకాశిక నాయక్ అన్‌సోల్డ్

  • Nov 27, 2025 17:53 IST

    తెలుగమ్మాయి త్రిష అన్‌సోల్డ్

    కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 17:51 IST

    సంస్కృతి గుప్తాను తీసుకున్న ముంబై

    సంస్కృతిని రూ.20 లక్షలకు తీసుకున్న ముంబై

    ప్రేమ రావత్‌ను రూ.20 లక్షలకు ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి తీసుకున్న ఆర్సీబీ

  • Nov 27, 2025 17:50 IST

    దీయా యాదవ్‌కు రూ.10 లక్షలు

    అన్‌క్యాప్‌డ్ బ్యాటర్ దీయాను కనీస ధరకు తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

  • Nov 27, 2025 17:49 IST

    అన్‌సోల్డ్ అయిన అన్‌క్యాప్‌డ్ బ్యాటర్లు

    • ప్రణవి చంద్ర కనీస ధర రూ.10 లక్షలు.. అన్‌సోల్డ్

    • డెవినా ఫెరిన్ కనీస ధర రూ.20 లక్షలు.. అన్‌సోల్డ్

    • వింద్రా దినేశ్‌ కనీస ధర రూ.10 లక్షలు.. అన్‌సోల్డ్

    • దిశా కసత్ కనీస ధర రూ.10 లక్షలు.. అన్‌సోల్డ్

    • అరుషి గోయెల్ కనీస ధర రూ.10 లక్షలు.. అన్‌సోల్డ్

  • Nov 27, 2025 17:30 IST

    ఆశా శోభనకు రూ.1.1 కోట్లు

    • భారత స్పిన్నర్ ఆశా శోభనను రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్

    • శోభన కనీస ధర రూ.30 లక్షలు

  • Nov 27, 2025 17:23 IST

    అలానా కింగ్ అన్‌సోల్డ్

    • అలానా కనీస ధర రూ.40లక్షలు

    • కొనుగోలుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 17:22 IST

    లిన్సే స్మిత్‌కు రూ.30 లక్షలు

    • ఇంగ్లాండ్‌ బౌలర్ లిన్సే స్మిత్‌ను కనీస ధరకు తీసుకున్న ఆర్సీబీ

    • ప్రియ మిశ్రా, అమండా-జాడే వెల్లింగ్టన్, సైకా ఇషాక్ అన్‌సోల్డ్

  • Nov 27, 2025 17:16 IST

    ఎంఐకి షబ్నిమ్

    తిరిగి ఎంఐ జట్టుకు చేరుకున్న సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్

    రూ.60లక్షలకు సొంతం చేసుకున్న ఎంఐ

  • Nov 27, 2025 17:14 IST

    క్రాంతి గౌడ్‌కు రూ.50లక్షలు

    • భారత బౌలర్ క్రాంతి గౌడ్‌ను కొనుగోలు చేసిన యూపీ

    • ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి రూ.50లక్షలకు సొంతం చేసుకున్న యూపీ

  • Nov 27, 2025 17:11 IST

    ఉమా ఛెత్రి అన్‌సోల్డ్

    • అన్‌సోల్డ్ అయిన భారత వికెట్‌కీపర్ ఉమా ఛెత్రి

    • కనీస ధర రూ.50 లక్షలు

    • లిజెల్ లీ (సౌతాఫ్రికా)ను కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ జట్టులోకి తీసుకున్నారు.

  • Nov 27, 2025 17:09 IST

    లారెన్ బెల్‌కు రూ.90లక్షలు

    • లారెన్ బెల్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ

    • రూ.90లక్షలకు సొంతం చేసుకున్న బెంగళూరు

  • Nov 27, 2025 17:06 IST

    ఆ ఇద్దరూ అన్‌సోల్డ్

    • అన్‌సోల్డ్ అయిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్లు అమీ జోన్స్, ఈజీ గేజ్

    • ఈ ఇద్దరినీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 16:50 IST

    యూపీకి హర్లీన్ డియోల్

    టీమిండియా ప్లేయర్ హర్లీన్ డియోల్‌ను కొనుగోలు చేసిన యూపీ

    రూ.50లక్షలకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్ జట్టు

  • Nov 27, 2025 16:49 IST

    ఆర్సీబీకి రాధా యాదవ్

    భారత ఆల్‌రౌండర్ రాధా యాదవ్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ

    రూ.65లక్షలకు వేలం పాడి సొంతం చేసుకున్న బెంగళూరు

  • Nov 27, 2025 16:48 IST

    స్నేహ్ రాణాకు రూ.50లక్షలు

    • టీమిండియా ప్లేయర్ స్నేహ్ రాణాను కొనుగోలు చేసిన ఢిల్లీ

    • రూ.50లక్షలకు జట్టులోకి తీసుకున్న ఢిల్లీ

  • Nov 27, 2025 16:40 IST

    తెలుగుమ్మాయి శ్రీ చరణికి రూ.1.30కోట్లు

    • టీమిండియా స్టార్ బౌలర్ శ్రీ చరణిని కొనుగోలు చేసిన ఢిల్లీ

    • కనీస ధర రూ.30లక్షలు

    • ఈమె కోసం పోటీ పడ్డ ఢిల్లీ, యూపీ

    • చివరకు రూ.1.30కోట్లతో ఢిల్లీ సొంతం

  • Nov 27, 2025 16:38 IST

    చినెల్లే హెన్రీకి రూ.1.30 కోట్లు

    • చినెల్లే హెన్రీని దక్కించుకున్న ఢిల్లీ

    • కనీస ధర రూ.30లక్షలు

    • రూ.1.30కోట్లకు కొనుగోలు చేసిన జట్టులోకి తీసుకున్న ఢిల్లీ

  • Nov 27, 2025 16:33 IST

    కిరణ్ నవ్‌గిరేకు రూ.60లక్షలు

    • ఈమె కనీస ధర రూ.40లక్షలు

    • ఆర్‌టీమ్ కార్డు ఉపయోగించి రూ.60లక్షలకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 16:31 IST

    లిచ్‌ఫీల్డ్‌కు రూ.1.20కోట్లు

    • ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేసిన యూపీ

    • ఈమె కనీస ధర రూ.50లక్షలు

    • రూ.1.20కోట్లకు వేలం పాడి దక్కించుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 16:29 IST

    అన్‌సోల్డ్

    • అన్‌సోల్డ్ అయిన ఎన్ మేఘన, తజ్మిన్ బ్రిట్స్

    • వీరి కనీస ధర రూ.30లక్షలు

    • వీరిని కొనగోలు చేయడానికి ఆసక్తి చూపించని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 16:22 IST

    లారా వోల్వార్ట్‌ను దక్కించుకున్న ఢిల్లీ

    • సౌతాఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్ట్‌‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

    • కనీస ధర రూ.30 లక్షలు.. ఈమెను తీసుకోవడానికి పోటీ పడ్డ బెంగళూరు, ఢిల్లీ

    • చివరకు రూ.1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

  • Nov 27, 2025 16:19 IST

    యూపీ వారియర్స్‌కే మెగ్ లానింగ్

    • ఆసీస్ క్రికెటర్ మెగ్ లానింగ్‌ను దక్కించుకున్న యూపీ

    • కనీస ధర రూ.50లక్షలు

    • రూ.1.90కోట్లకు ఈమెను కొనుగోలు చేసిన యూపీ

  • Nov 27, 2025 16:17 IST

    సోఫీ ఎకిల్‌స్టోన్‌కు రూ.85 లక్షలు

    • ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ దక్కించుకున్న యూపీ

    • కనీస ధర రూ.50 లక్షలు.. ఆర్‌టీమ్‌ కార్డును ఉపయోగించి రూ.85 లక్షలకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్

  • Nov 27, 2025 16:15 IST

    గుజరాత్‌కు రేణుకా సింగ్

    • టీమిండియా స్టార్ పేసర్ రేణుకా సింగ్‌ను కొనుగోలు చేసిన గుజరాత్

    • బేస్ ప్రైజ్ రూ.40లక్షలు కాగా.. రూ.60లక్షలకు దక్కించుకున్న గుజరాత్ జెయింట్స్

  • Nov 27, 2025 16:13 IST

    అమేలియా కెర్‌కు రూ.3కోట్లు

    • న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

    • రూ.3కోట్ల ధరకు కొనుగోలు చేసిన ఎంఐ

  • Nov 27, 2025 16:10 IST

    దీప్తి శర్మ యూపీ వారియర్స్‌ సొంతం

    • టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బేస్ ప్రైజ్ రూ.50లక్షలు

    • అంతే ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన ఢిల్లీ ఫ్రాంచైజీ

    • ఈ క్రమంలో ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించిన యూపీ వారియర్స్

    • రూ.3.20కోట్లకు బిడ్ వేసిన యూపీ ఫ్రాంచైజీ

    • ఢిల్లీ అంత ధరకు తీసుకోవడానికి నిరాకరించిన యూపీ

    • దీంతో రూ.3.20 కోట్లతో తిరిగి దీప్తి శర్మ దక్కించుకున్న యూపీ

  • Nov 27, 2025 16:06 IST

    సోఫీ డివైన్‌కు రూ.2 కోట్లు

    • న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ కనీస ధర రూ.50లక్షలు

    • ఈమె కోసం గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ

    • చివరకు రూ.2కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్

  • Nov 27, 2025 16:03 IST

    అలీసా హీలీ అన్‌సోల్డ్

    • అన్‌సోల్డ్ అయిన ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీ

    • ఆమె బేస్ ధర రూ.50లక్షలు

    • అలీసాను కొనగోలు చేయడానికి ఆసక్తి చూపించని ఫ్రాంచైజీలు

  • Nov 27, 2025 16:01 IST

    ఆక్షనీర్ మల్లికా సాగర్

    • డబ్ల్యూపీఎల్ తొలి మెగా ఆక్షన్‌ను నిర్వహిస్తున్న మల్లికా సాగర్

    • గతంలోనూ డబ్ల్యూపీఎల్ వేలానికి ఆక్షనీర్ పని చేసిన మల్లికా