World Para Athletics Championships: పారా పండుగ
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:30 AM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సకు శనివారం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తెరలేవనుంది. వచ్చే నెల ఐదు వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక పోటీలలో ప్రపంచ మేటి పారా అథ్లెట్లు...
నేటినుంచి ప్రపంచ పారా అథ్లెటిక్స్
100 దేశాలు, 1500 మంది అథ్లెట్లు
బరిలో తెలుగు అథ్లెట్లు దీప్తి, రవి, అకీరా
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సకు శనివారం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తెరలేవనుంది. వచ్చే నెల ఐదు వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక పోటీలలో ప్రపంచ మేటి పారా అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 100 దేశాల నుంచి మొత్తం 1500 మందికిపైగా పారా అథ్లెట్లు 186 పతక (101 పురుషులు, 84 మహిళలు, ఒక మిక్స్‌డ్ విభాగం) ఈవెంట్లలో తలపడుతున్నారు. ఇక.. 76 మంది బృందంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆతిథ్య భారత్ పతకాల పట్టికలో టాప్-5లో ఉండడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. కిందటిసారి (17 పతకాలు) మించి..ఈసారి 20 మెడల్స్ దక్కించుకోవాలని మనోళ్లు పట్టుదలగా ఉన్నారు. తెలంగాణకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ దీప్తి జీవాంజి (మహిళల 400 మీటర్లు) టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉండగా.. పురుషుల 400 మీటర్లలో తెలంగాణకే చెందిన బానోతు అకీరా నందన్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆంధ్ర అథ్లెట్, అనకాపల్లికి చెందిన రొంగలి రవి షాట్‌పుట్‌లో తలపడనున్నాడు. మిగతా స్టార్ అథ్లెట్లలో సుమిత్ అంటిల్, సుందర్‌సింగ్ (జావెలిన్ త్రో), ప్రవీణ్ (హైజంప్), సుమిత్, ఎక్తాభ్యాన్ (మహిళల క్లబ్ త్రో), సిమ్రన్ శర్మ (మహిళల 200 మీ.) తదితరులు భారత్ నుంచి ప్రధాన ఆకర్షణ కానున్నారు.
వైదొలగిన పాకిస్థాన్
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ నుంచి వైదొలగుతున్నట్టు పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది. భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో తమ ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ జాతీయ పారా ఒలింపిక్ కమిటీ వివరించింది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News